
పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 9,తల్లాడ రిపోర్టర్ బాబురావు తల్లాడ మండల పరిధిలోని అన్నారుగూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇసనపల్లి లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావించి మూడు దశాబ్దాలు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ అంటే ఎస్సీలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ, అగ్రకులాల్లో పేదలకు అనేక పథకాలు అందే విధంగా పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపన అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి హక్కులను సాధించుకోవడం జరిగిందన్నారు. అమరవీరుల ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడ్ల కిసిందరావు, గొడ్ల వెంకటరత్నం, కొత్తపల్లి దానయ్య, బొల్లేపోగు నరసింహారావు, కొత్తపల్లి వెంకటయ్య, విమలమ్మ, దయత సాగర్, గొడ్ల గురవయ్య, వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.