పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 9, తల్లాడ రిపోర్టర్ బాబురావు తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనానికి ఖమ్మం పట్టణానికి చెందిన గుబ్బల రవికుమార్ 120 మొక్కలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కేవీ) సూచన మేరకు ఆయన ఆ మొక్కలను అందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన సంరక్షణలో భాగంగా మొక్కలు కావాలని ఆయనను అడగటంతో స్పందించిన ఆయన 10 రకాల పండ్ల మొక్కలను అందించారు. బుధవారం ఆ మొక్కలను సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు సెక్రటరీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్నపల్లి శ్రీనివాసరావు, పిన్ని హరీష్, తదితరులు పాల్గొన్నారు.