ఆదోని పట్టణంలోని 6వ వార్డులో ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం.

పయనించే సూర్యుడు జులై 9 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఈరోజు ఆదోని పట్టణంలోని 6వ వార్డులో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో, ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు , యువ నాయకులు సిద్ధార్థ నాయుడు, 6వ వార్డు ఇన్‌చార్జ్ అమర్ ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ,:- ఆదోని నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎంతోమంది ప్రజలు తమ ఓటర్ల వివరాలను ధృవీకరించుకుంటున్నప్పటికీ, ఇంకా కొంతమంది ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. మరో ఎనిమిది రోజుల్లో ఓటర్ వెరిఫికేషన్ గడువు ముగియనున్నందున, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోని వారి ఓట్లు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉందని ప్రజలకు తెలియజేశారు.అలాగే ప్రతి కుటుంబం తమ ఓటు హక్కును కాపాడుకునే బాధ్యతతో ముందుకు రావాలని, అవసరమైతే సమీపంలోని బి ఎల్ ఓ లేదా సంబంధిత అధికారులను సంప్రదించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఉమాపతి నాయుడు చెప్పారు*.