క్లస్టర్ 5 పరిధిలో పల్లంకుర్రు యూనిట్ సమావేశం

పయ నించే సూర్యుడు జూలై 9 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)

.

కాట్రేనికోన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, క్లస్టర్ 5 పరిధిలో పల్లంకుర్రు యూనిట్ 26 ఇన్‌చార్జి వెంట్రు సుధీర్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ యూనిట్ సమావేశం జరిగింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యుడు కూడా అయిన వెంట్రు సుధీర్ పార్టీ సీనియర్ నాయకుడు పెన్మెత్స రామరాజు నివాసంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాట్రేనికోన మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, పల్లంకుర్రు గ్రామ కమిటీ అధ్యక్షులు, క్లస్టర్ 5 ఇన్‌చార్జి ఇసుకపట్ల వెంకటేశ్వరరావు హాజరై సూచనలు ఇచ్చారు. సర్ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో వెంట్రు సుధీర్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు బూత్ ఇన్‌చార్జిల వద్ద నుంచి బూత్ స్థాయి సమస్యలను తెలుసుకున్నారు. పల్లంకుర్రు పంచాయితీ పరిధిలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, స్మశానవాటికకు సంబంధించిన సమస్యలను కార్యకర్తలు, నాయకులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలపై తీర్మానాలు చేసి, సమావేశ ఫోటోలు, సభ్యుల హాజరు వివరాలను మై తెలుగుదేశం యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లంకుర్రు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మంతెన సూరిబాబు రాజు, పల్లంకుర్రు మాజీ సర్పంచ్ ఇసుకపట్ల అమ్మాజీ రాంబాబు, పార్టీ సీనియర్ నాయకుడు పెన్మెత్స రామరాజు, కాట్రేనికోన మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బడుగు పుల్లారావు, పల్లంకుర్రు యూనిట్ 25 ఇన్‌చార్జి కసిరెడ్డి రాజా, ముమ్మిడివరం పట్టణ నాయకుడు భీమవరపు శ్రీనివాస్, బూత్ ఇన్‌చార్జి భూపతిరాజు వర్మ, మాజీ వార్డు సభ్యుడు ఇసుకపట్ల గోవింద్, మోకా సత్తిబాబు, ఇసుకపట్ల చక్రవర్తి, ఇసుకపట్ల జయంతిరావు, పెన్మెత్స కృష్ణంరాజు, పెయ్యిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.