గిరిజన నాయకుడు అజ్మీరా వీరన్నను పరామర్శించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

పయనించే సూర్యుడు న్యూస్ – జులై 9 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలంలోని భిక్య తండాకు చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు అజ్మీరా వీరన్న మాతృమూర్తి అజ్మీరా ఈరి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆమె దశదిన కార్యక్రమం సోమవారం భిక్య తండాలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు భిక్య తండాకు చేరుకుని అజ్మీరా వీరన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అజ్మీరా ఈరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి దుఃఖంలో తాము భాగస్వాములమని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అజ్మీరా ఈరి గిరిజన సమాజంలో అందరితో ఆప్యాయంగా మెలుగుతూ మంచి పేరు సంపాదించుకున్నారని, ఆమె మరణం కుటుంబానికే కాకుండా గ్రామానికి తీరని లోటని నాయకులు అన్నారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, యువజన నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అజ్మీరా ఈరికి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.