చెరువు మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయండి.

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.

పయనించే సూర్యుడు జూలై 9 తొర్రూరు మండలం రిపోర్టర్ శ్రీధర్. తొర్రూరు మండలం గుర్తురు గ్రామ శివారులో ఉన్న రామసముద్రం చెరువు మరమ్మత్తు పనులను పాలకుర్తి శాసనసభ సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సందర్శించారు. చెరువు కట్ట తూము మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత గుర్తూరు, సొమారం గ్రామాలకు చెందిన రైతులకు సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు సుమారు 1,600 ఎకరాల ఆయకట్టుకు నీటి అందుబాటు మెరుగుపడి వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి సాగునీటి వనరును పరిరక్షిస్తూ రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీంద్రాచారి, స్థానిక సర్పంచ్ విసంపల్లి కవిత బాలకృష్ణ, తొర్రురు పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.