నాగాపూర్‌లో పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

పయనించే సూర్యుడు జులై 09 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పెద్దకర్మ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హాజరయ్యారు ఈ సందర్భంగా కందుకూరి రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సుగుణక్క, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రాములు మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.