పయనించే సూర్యుడు జులై 9 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆహమ్మద్ నగర్, గాజులపల్లి, దొమ్మాట, పోసానిపల్లి, ఉప్పరపల్లి, దౌల్తాబాద్, లో పర్యటించి మహిళ సమైక్య భవనాలకు అలాగే సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ఆర్థిక సామాజిక, సాధికారితకు మహిళా సమాఖ్య, భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. మహిళా సంఘాల సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు మరియు స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఈ భవనాలు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాయపోల్ మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి, కోమటిరెడ్డి పద్మారెడ్డి, దౌల్తాబాద్ సర్పంచ్ అనురాధ, తిరుమలాపూర్ సర్పంచ్ బండారు లాలు, మాచినపల్లి సర్పంచ్ బొక్కల నాగరాజు, గోవిందా పూర్ సర్పంచ్ దాసు,పోసంపల్లి సర్పంచ్ లక్ష్మణ్, మల్లేశం పల్లి సర్పంచ్ రైతన్న, శేరుపల్లి బందారం పెరుమాళ్ళ నర్సింలు, దౌల్తాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోర్రోళ్ల స్వామి, ఉపాధ్యక్షులు బొల్లం.రాజేష్, ఏంసి డైరెక్టర్లు అన్నా రెడ్డి సంపత్ రెడ్డి, లతా కృష్ణ, పడాల మల్లేశం, సీనియర్ నాయకులు ఆది వేణుగోపాల్, డాకోల్ల ఆంజనేయులు, మహమ్మద్ షాదుల్లా, సోలిపేట ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..