యూనుస్ పుట్టినరోజు సందర్భంగా ఆగాపే ఆశ్రమంలో అన్నదానం

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జులై 9 యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆశ్రమంలో అగాపే ఆశ్రమంలో జూటురు ఇస్మాయిల్,భార్య రషీద వారి కుమారుడు యూనుస్ పుట్టినరోజు శుభ సందర్భముగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుమారుడు ఉద్యోగరీత్యా లండన్ ను ఉంటున్నప్పటికీ ప్రతి సంవత్సరము తన పుట్టినరోజున పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశ్రమంలో భోజనాలు సిద్ధం చేసుకొని ఆశ్రమంలోని వృద్ధులకు, నిరాశ్రయులకు అన్నదానం చేస్తున్నారు.ఖదీర్, సోయాబ్, షేక్షావలి, బషీర్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆశ్రమం ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుమారునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, రెండు చేతులు ఎత్తి దీవించారు. అన్నదానం నిమిత్తమై వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

.