వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా

మహానేత సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ – జూలై 9 సింగరేణి రిపోర్టర్ : గుగులోత్ నరేష్ 1సింగరేణి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను సింగరేణి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు నాయకత్వంలో సినిమా హాల్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ గృహాలు, రూపాయికే రేషన్ బియ్యం వంటి పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ప్రజల మనిషిగా, రైతుల ఆత్మీయుడిగా, పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని నాయకులు తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు పగడాల మంజుల, జిల్లా కార్యదర్శి బానోత్ రామ్మూర్తి నాయక్, జిల్లా నాయకులు తలారి చంద్రప్రకాశ్, సురేందర్, మనియర్ భీముడు నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు మేదరి టోనీ, బానోత్ హీరాలాల్, వాంకుడోత్ హనుమంతరావు, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, హనీఫ్, బొల్లా రమేష్, తాజుద్దీన్, రూప్లా నాయక్, నాగులు, వెంకటేశ్వర్లు, ఈర్య, షఫీ, చాంద్ పాషా, వినోద్, దేవుసింగ్, యాకుబ్ అలీ, సంగు, షేరు, గాంధీ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.