రోడ్డుపక్కల ఎప్పుడు కూలుతుందో తెలియని ఎండిన చెట్టు

ప్రమాదం జరగకముందే అధికారుల ఎండిన చెట్టును తొలగించాలి గ్రామస్తుడు ముల్లా రఫీ

పయనించే సూర్యుడు న్యూస్ జులై 09, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామం మీదుగా గోనెగండ్ల మండలానికి వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు బస్సు ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి, గంజహళ్లి, గోనెగండ్ల గ్రామాల రహదారి నడిబొడ్డున నాలుగు కిలోమీటర్ల మేర ఎండిన ఒక భారీ వృక్షం ఆర్ అండ్ బి రోడ్డును అనుకోని రోడ్డు పక్కలోనే ప్రమాదకరంగా ఉందని, ఎ క్షణమైనా కులిపోవడానికి సిద్ధంగా ఉందని గంజిహళ్లి గ్రామస్తుడు, ముల్లా రఫీ ఆరోపించారు. ఈ రహదారి గుండా వందల వాహనాలు ప్రయాణం చేస్తుంటాయని అలాంటి సమయంలో, ఈదురు గాలులకు ఎప్పుడైనా ఆ భారీ వృక్షం కూలడం ఖాయమన్నారు. కనుక ప్రమాద అంచున రాకపోకలు సాగిస్తున్నామని వాహనాదారులను దృష్టిలో పెట్టుకొని, సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక రెండు గ్రామల నాయకులు ఈ సమస్యపై కల్పించుకొని, ముందస్తు చర్యలుగా,ఆ ఎండిన భారీ వృక్షాన్ని తొలగించి వాహనాల రాకపోకలకు గ్రామస్తులకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఈ సమస్యపై వెంటనే స్పందించి అధికారుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పత్రిక ముఖంగా గంజిహళ్లి గ్రామస్తుడు రఫీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *