లహరి ఓణీల, రాఘవ పంచకట్టు వేడుకల్లో పాల్గొన్న చింతకాని మీడియా ప్రతినిధులు

పయనించే సూర్యుడు జులై 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ల్యాబ్ టెక్నీషియన్, ప్రజా దర్బార్ న్యూస్ రిపోర్టర్ గడ్డం విజయ్–శ్రీ హేమలత దంపతుల కుమార్తె లహరి ఓణీల వేడుక, కుమారుడు రాఘవ పంచకట్టు వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాని ప్రాంతానికి చెందిన మీడియా మిత్రులు వేడుకలో పాల్గొని చిన్నారులు లహరి, రాఘవలను ఆశీర్వదిస్తూ వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ మల్లేశ్వరి, శెట్టి సురేష్, కాశీబోయిన రామారావు, వేర్పుల కోటి, గండారపు రామారావు, గుడిది పిచ్చయ్య, వెన్నబోయిన సురేందర్, అంబటి శాంతయ్య, అనిల్ కుమార్ వెర్పుల తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *