ప్రజా హృదయ విజేత – సంక్షేమ పథకాల ప్రదాత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో లో ఘన నివాళులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 9 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని విలియంపేట, కన్యాకుమారి పాన్ షాప్ సెంటర్, క్రిస్టియన్ పేట, యాక్సిస్ ఏటీఎం సెంటర్, బస్టాండ్ సెంటర్, విజయవాడ రోడ్డులోని వైఎస్ఆర్ సర్కిల్, ధనం బోర్డు, తొర్రగుంటపాలెం, కాకాని నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. జగ్గయ్యపేట పట్టణంలో ధనం బోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాలాభిషేకం నిర్వహించి మహానేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని వృద్ధాశ్రమంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచాయని, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *