చెయ్యరు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు

పయ నించే సూర్యుడు, జూలై 9 ముమ్మిడివరం ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం కాట్రేనికోన మండలం చెయ్యేరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త అయిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జాతీయవాదం, దేశ సమగ్రత కోసం చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు గొల్ల కోటి వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మట్ట సూరిబాబు, నంద్యాల చంటి, కొత్తలంక సురేష్ తదితరులు పాల్గొసురేష్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *