అంగన్వాడీలో ఉమెన్స్ వీక్ కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 26 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల ఐసిడిఎస్ ప్రాజెక్టు లోనీ రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రాలలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక లో భాగంగా ఉమెన్స్ వీక్ ప్రోగ్రాం న్యూట్రిషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని ,రక్తహీనత నుండి తల్లులను, పిల్లలను దూరం చేయాలని తెలిపారు. మంచి స్థానికంగా లభించే పండ్లు ఆకుకూరలు కూరగాయలు అన్ని సీజనల్ వారీగా తీసుకోవాలని చెప్పారు.స్థానికంగా లభ్యమయ్యే పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించడం, ద్వారా మహిళలు, కిశోర బాలికలు మరియు పిల్లల పోషక స్థితిని మెరుగుపరచడం, ప్రోత్సహించడం ,తక్కువ ఖర్చు తొ కూడిన పోషకాహార పదార్థాలు ప్రదర్శన ఏర్పాటు చేయడము జరిగింది . జంక్ ఫుడ్ ను నివారించి ఇంటిలో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి అనే సందేశంతో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి, ఉప సర్పంచ్ ,గురులింగు వినయ్, పాలకవర్గ సభ్యులు అంగన్వాడి టీచర్లు శారద , మేఘమాల, రమాదేవి, గంగు, ఏ ఎన్ ఎం జ్యోతి, ఆశ వర్కర్ కే.సుజాత, పి సుజాత,ఎస్ కవిత, ఎన్ లక్ష్మీ, జే రజిత,గర్భిణీలు, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు, ఎస్ హెచ్ జి సంఘ సభ్యులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.