అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్స్ దొంగలు 7 గురు అరెస్ట్

★ రాగి కాయిల్స్ 80 కేజీలు ★ రెండు మోటార్ సైకిల్ ★ నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం ★ పోలీసులకు అభినందించిన జిల్లా పోలీస్ కమిషనర్

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 రెంజల్ ఎస్సై గురువారం సాయంత్రం నాడు 5 గంటల సమయం లో రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తన సిబ్బంది తో కలిసి సాటాపూర్ బై పాస్ వద్ద వాహనాల తనికి చేస్తుండగా 5 గురు వ్యక్తులు మూడు మోటార్ సైకిల్ లపై అనుమనస్పదంగా వస్తు పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా వాళ్ళను పట్టుకొని తనిఖి చేయగా వల్ల వద్ద ఒక గన్ని బ్యాగ్ లో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న పదార్థాలు రాగి కాయిల్స్ 80 కేజీలు రెండు మోటార్ సైకిల్ నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు వాళ్ళను విచారించగ మెదక్ మరియు బోధన్ కు చెందిన పై వ్యక్తులు గా గుర్తించి గత రెండు సం. రాల నుండి పై 5 గురు వ్యక్తులు ఒక గ్యాంగ్ గా ఏర్పడి మొత్తం 64 ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి వాటిలోని కాపర్ కాయిల్ లను దొంగతనం చేశారు అందులో నిజామాబాద్ జిల్లా లో రెంజల్ బోధన్ రూరల్ బోధన్ టౌన్ వర్ని కోటగిరి ట్రాన్స్ఫవర్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు చేసినారు. దొంగతనం చేసిన కాపర్ కాయిల్ లను బోధస్, నిజామాబాద్ మరియు మేడ్చల్ కు చెందిన స్క్రాప్ షాప్ వాళ్ళకు అమ్ముకుంటున్నారు.ఇట్టి కేసును చేదించడంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్ మస్తాన్ అలీ ఏసిపి ట్రాఫిక్ నిజామాబాద్ సాయినాథ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రెంజల్ ఎస్సై చంద్ర మోహన్ బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందేర్ రెడ్డి సిసిఎస్ ఎస్ఐ విట్టల్ రవి విశాల్ విశాల్ కానిస్టేబుల్ కృష్ణ వీరికి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అభినందించారు.