పయనించే సూర్యుడు జూలై 3 తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ మండల పరిధిలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడిని నిర్వహించారు పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 18,820 రూపాయల నగదు రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్లు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలో అక్రమ జూద వ్యాపారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు