పయనించే సూర్యుడు న్యూస్:జూన్/07:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్ల మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రాం లోని చెందిన ఓదెల ఆనంద్, శివ కుమార్ అన్నదమ్ములు ఇటీవల అగ్నివీర్‌లో ఎంపికై భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించిన సందర్భంగా శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం.రాజు, యువజన సంఘాల అధ్యక్షుడు రేగుల కార్తిక్ పాల్గొని ఆనంద్, శివ లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ యువత క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అగ్నివీర్‌లో ఎంపికైన అరుణ్, శివలు గ్రామానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాకం సుమన్, యువజన సంఘాల సభ్యులు ఒగ్గు మధు, దాసరి శివరామ్, గంగం అనిల్, మహేందర్ రెడ్డి, నరేష్, అనిల్, వెంకటేష్, బాబు, నిఖిల్, నరేష్, సన్నీ, రాజు, నవీన్, ప్రవీణ్, అశ్విత్, రాము, మధు, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.