పయనించే సూర్యుడు జూన్ 04, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరళ్లపల్లి గ్రామంలో గత 20-30 ఏళ్లుగాఏకఛత్రాధిపత్యం చెలాయించిన కొందరు నాయకులు, ఇప్పుడు అధికారం కోల్పోయాక అవమానంతో, అసూయతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ , తాము చేసిన పప్పులు ఉడకడం లేదనే అక్కసుతోనే సర్పంచ్ పై, ఆమె కుటుంబంపై లేనిపోని విమర్శలు చేస్తూ రాజకీయ దుమారానికి తెరలేపుతున్నారని నేరళ్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రేవల్లి కృష్ణ అన్నారు. గ్రామంలో జరుగుతున్న ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ సర్పంచ్ స్వయంగా పాల్గొంటున్నారు. అయినప్పటికీ, కావాలనే సర్పంచ్ భర్త జమీర్ బాషా ని టార్గెట్ చేస్తూ, "అధికారిక కార్యక్రమాల్లో సర్పంచ్ పాల్గొనడం లేదు" అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ఆ వర్గం నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమని హెద్దేవా చేశారు .సర్పంచ్ పై విమర్శలు చేస్తున్నది కేవలం కొందరు స్వార్థపూరిత నాయకులు మాత్రమే, ప్రజలు కాదు. ప్రజలు వారిని నమ్మి ఉంటే, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి పట్టం కట్టేవారని హితవు పలికారు. ప్రజల మద్దతు సర్పంచ్ కి ఉందని ఎన్నికల ఫలితాలే నిరూపించాయని, అభివృద్ధిని చూసి ఓర్వలేని నాయకులు ఇటువంటి ఆరోపణలు చేయడం మానుకోవాలి" అని హెచ్చరించారు.