
పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 14గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో తనఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశం ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా సీటు చోరీకి కూడా దిగజారినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి విమర్శించారు. శనివారం గజ్వేల్ లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో ఇంతకాలం ఓటు చోరీకి పాల్పడిన భాజపా ఇప్పుడు అధికారం కోసం సీటు చోరీకి కూడా వెనకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే క్రమంలో ఆగ్రనేతలపై అక్రమ కేసులు నమోదు చేయిస్తుండగా, చివరకు గాంధేయవాది మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ సభ్యత్వo దక్కకుండా కుట్రలు చేసినట్లు ఎద్దేవా చేశారు. ఎలాంటి కేసులు లేనప్పటికీ బిజెపి నేతల ఫిర్యాదుతో నామినేషన్ పత్రాలను తిరస్కరించడం సిగ్గుచేటని నిలదీశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ దేశాన్ని అప్పులపాలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బిజెపి మినహా ఇతర పార్టీల ఉనికి లేకుండా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి భవిష్యత్తులో అదే గతి తప్పదని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కుల మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి అసలు నైజాన్ని గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధికి అడ్డు తగులుతున్న బిజేపి నేతలను ప్రజలు నిలదీయాలని కోరారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, సాగుకు సరిపడా ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో రైతులను ఆదుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి, జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు సమీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్, మాజీ డిసిసి ఉపాధ్యక్షులు గుంటూకు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, కనకయ్య, నేతలు రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, డాక్టర్ వహీద్, యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ అధ్యక్షులు అజర్ తదితరులు పాల్గొన్నారు.