అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్య

జనం న్యూస్ జూన్(7) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ నియోజకవర్గంలోని 9 మండలాల ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించినాడు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లులు పేదలకు అందేలా చూడాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ ఫలాలు పేదలకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించినాడు.