పయనించే సూర్యుడు/ జూన్ 13/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ సాయిలోక్ కాలనీలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను కమలానగర్ స్ఫూర్తి లయన్స్ క్లబ్ ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న ఆ చిన్నారుల నివాసానికి వెళ్లి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చిన్నారులకు ఓరడింపు ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల తక్షణ అవసరాల నిమిత్తం వారు రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ చిన్నారులకు భవిష్యత్తులో విద్యా, వైద్య పరంగా ఎలాంటి అవసరాలు వచ్చినా తాము సిద్ధంగా ఉంటామని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. సమాజంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంఎం రాజు, భాస్కర్ రెడ్డి, కరిపే ప్రవీణ్, వంజరి మధు, కాలనీ వాసులు ప్రకాష్, శ్రీనివాస్, సురేష్, రాణి, అంజయ్య, నాగరాజు, నరసమ్మ, రాజేష్, ఉమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.