పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 5,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ శివారులోని సవళ్లలో రామాలయం వద్ద 12వ వార్డు రైతుల ఆధ్వర్యంలో ఏఈవో హసీనాకు గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), గ్రామ రైతులు కొమ్మినేని చలపతిరావు, దిరిశాల శ్రీనివాసరావు, వార్డు మెంబర్ పొన్నం పద్మావతి హాజరై ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను పలువురు రైతులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నం కృష్ణయ్య, దుగ్గినేని సత్యమయ్య, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, గోవిందు శ్రీనివాసరావు ట్రాక్టర్, గుమ్మా శ్రీను, గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు.