అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటుకు రెండేళ్లు

★ సూపర్ సిక్స్ హామీలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ★ పెనుగంచిప్రోలు మండల స్థాయిలో నిరసన హోరు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా/జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 5 పెనుగంచిప్రోలు గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి &జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు పోన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు గడిచిన సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు అబద్ధపు హామీలు, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు భృతి, రైతులకు ఆర్థిక సహాయం, కీలక హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.. ప్రజలు విశ్వసించి అధికారం అప్పగిస్తే, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, కానీ కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరలు పెరిగిపోయాయని, రైతులు, యువత, మహిళలు, పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందించి ప్రతి వర్గానికి మేలు చేసిందని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.. ప్రజల సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెనుగంచిప్రోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోన్నం కోటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి పెంటయ్య రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షులు పెనుగంచిప్రోలు మండల అయ్యా ఎంపీపీ మర్కపూడి గాంధీ .రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కన్నామల శామ్యూల్ పెనుగంచిప్రోలు జడ్పిటిసి సభ్యురాలు ఉట్ల నాగమణి రాష్ట్ర బీసీ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు పెనుగంచిప్రోలు మండల సోషల్ మీడియా కన్వీనర్ నల్లబోతుల వెంకటేష్ పెనుగంచిప్రోలు గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ పెనుగంచిప్రోలు మండల మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకపుడి భాస్కరరావు. పెనుగంచిప్రోలు మండల సర్పంచులు పెనుగంచిప్రోలు మండల ఎంపీటీసీలు మరియు మండల సెక్రెటరీ కార్యదర్శి గ్రామ సెక్రెటరీ గ్రామ కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు