పయనించే సూర్యుడు5-7-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అమరవీరుడు దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మా ఘన నివాళులు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు దొడ్డి కొమురయ్య గారి త్యాగం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలను స్మరిస్తూ, సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కు ఘన నివాళులు అర్పించిడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం మాజీ ఉపసర్పంచ్ మారం రాజశేఖర్ మాజీ సర్పంచ్ కాలువ రాజయ్య మాజీ ఎంపీపీ కాంపెల్లి హనుమండ్లు రాపలే మాజీ సర్పంచ్ మారంపెల్లి బాబు రాజారత్నం యాదవ సంగం ఉపాధ్యక్షులు సందవేణి సతీష్ ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్ కాలువ శ్రీనివాస్ కాలువ మధు మూత్త గణేష్,స్వామి ఎల్పులరాము,సరూసాని అనిల్ కాలువ గంగన్న తదితరులు పాల్గొన్నారు.