అమెరికాలో పెరిగినా… భారతీయ సంస్కృతిని హృదయంలో నింపుకున్న చిన్నారి దీక్షరంగరంగ వైభవంగా “మల్లిడి దీక్ష హాఫ్ సారీ వేడుక”

పయనించే సూర్యుడు మే 20, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కోనసీమ జిల్లా రామచంద్రపురం లో అమెరికాలో పెరిగినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నరనరాల్లో జీర్ణించుకోవడం మల్లిడి రామారెడ్డి – కృష్ణప్రియ దంపతుల కుమార్తె చిన్నారి దీక్ష ప్రత్యేకత అని ప్రముఖ లీగల్ కన్సల్టెంట్ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ఎం. ఏ., ఎల్ .ఎల్ .ఎం., కొనియాడారు. రామచంద్రపురంలోని మల్లిడి వెంకట కృష్ణారెడ్డి గారి స్వగృహంలో జరిగిన “మల్లిడి దీక్ష హాఫ్ సారీ వేడుక” అత్యంత ఘనంగా జరిగింది. ఇంటి ఆవరణను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి నిర్వహించిన ఈ వేడుక కుటుంబ బంధాల ఆప్యాయతకు ప్రతీకగా నిలిచింది. దీక్ష నాయనమ్మ తాతలు సత్తి వెంకటేశ్వర రెడ్డి – కృష్ణవేణి దంపతులు, అమ్మమ్మ తాతలు మల్లిడి కుసుమలత – వెంకటకృష్ణారెడ్డి దంపతులు, తల్లిదండ్రులు మల్లిడి రామారెడ్డి – కృష్ణప్రియ దంపతులు వచ్చిన ప్రతి అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించి ఆదర్శ ఆతిథ్యాన్ని చాటిచెప్పారు. వేడుక అనంతరం అతిథులకు రామచంద్రపురంలోని బాబుల్ గారి గెస్ట్ హౌస్‌లో ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. అతిథుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వెజ్, నాన్ వెజ్ వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా దేవుడి పూజకు ఉపయోగపడే రాగి పళ్లాలను రిటర్న్ గిఫ్ట్‌గా అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకకు హాజరైన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చిన్నారి దీక్షకు ఆశీస్సులు అందజేశారు. “విదేశాల్లో పెరిగినా భారతీయతను మరిచిపోకుండా సంస్కారాలను కాపాడుకోవడం ఎంతో గొప్ప విషయం. మన సంప్రదాయాలు, కుటుంబ విలువలు ఎప్పటికీ నిలిచి ఉండాలి” అని ఈ సందర్భంగా లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.