అరాచక పాలన వైసిపిది

★ అభివృద్ధి పాలన తెలుగుదేశం పార్టీది. ★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు జూన్ 5 ఆదోని నియోజకవర్గం రూరల్ రిపోర్టర్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతో మాత్రం సాధ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది టిడిపి తోనే సాధ్యం 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని క్యాపిటల్గా ప్రకటించారు అలాగే హీరో కియా ఇలాంటి ఎన్నో కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన ఘనత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి దక్కుతుంది 2019 నుంచి 2024 వరకు వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి యువతకు ఉపాధి ఎన్ని తెచ్చినారు చూపించండి ఐదు సంవత్సరములు అరాచకాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక పోయింది అభివృద్ధి అంటే అర్థం తెలియని దేశంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే దేశ రాజకీయాల్లో అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అని గుర్తింపు తెచ్చుకునే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ పని చేస్తున్నారు అది చూసి తట్టుకోలేక రపరపా అని కొడ్డలి చూపిస్తూ అసూయ పడుతున్నారు సంస్కారం లేని నాయకులు మీరు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరములు ఎంతో అభివృద్ధి చెందింది ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అంతేకాదు శాశ్వత రాజధానిగా అమరావతిని రూపకల్పన మారుస్తున్నారు, రాయలసీమలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పెట్టుబడి 26% వచ్చినాయి, అంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు శ్రమ, ఇప్పుడు రెండేళ్ల పాలన లో అరాచకం జరిగిందని రోడ్డు మీద వస్తున్నారు సిగ్గు అనిపించటం లేద మీకు, ఆంధ్ర రాష్ట్రాన్ని సముద్రంలో కలిపే పని చేస్తున్నారు, కానీ మా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఆశయం.