అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా ఎమ్మెల్యే జారే అడుగులు

★ ఓర్చుకోలేని కొంతమంది నాయకులు ఎమ్మెల్యే పై అసత్య ప్రచారం ★ అభివృద్ధిని ఆపలేరని ఎమ్మెల్యే అభిమానులు ఫైర్

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి అశ్వారావుపేట స్థానిక శాసన సభ్యులు జారే ఆదినారాయణ ఉమ్మడి జిల్లా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘు రామ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వారి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉండటం వల్ల సమయం సర్దుబాటు కానీ కారణం చేత మాత్రమే మంత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు తప్ప దీనిలో ఎమ్మెల్యే ఏ రాజకీయ దురుద్దేశం కానీ ఆధిపత్య పోరు చూపాలని ఎమ్మెల్యే కి లేదని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రి ల తో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంచి స్నేహ బంధాన్ని కలిగి, సమన్వయం పరుస్తూ అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే ద్యేయంగా ముందుకు సాగు తున్న ఎమ్మెల్యే పై కొంతమంది నాయకులు కావాలనే బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించడం జరిగింది. ఎమ్మెల్యే కి ఏ స్వార్ధ పూరిత ఉద్దేశ్యం గానీ రాజకీయ దురుద్దేశం గానీ వర్గాల మధ్య ఈ విధమైన విభేదాలు సృష్టించాలనే ఆలోచన తనకి లేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అందర్ని సమన్వయ పరుస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే పై వాస్తవం లేని అబద్ధపు ప్రచారాలతో కొంతమంది నాయకులు విభేదాలు సృష్టించడం సమంజసం కాదని అలాంటి వారిపై పార్టీ తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది