ఆకాశం వైపు ఆశగా… కన్నీరు మున్నీరవుతున్న అన్నదాత

పయనిoచే సూర్యుడు కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్ట్ ఎరుకల మహేష్ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామం నందు రైతులు ,బోయ గిరిజాపతి బీపీ నాగరాజు, హెచ్ లింగన్న బ్యాంకులో అప్పు తెచ్చి పత్తి పంట వేసి కానీ విత్తనాలు మొలకలు వచ్చాయి కానీ వర్షాలు లేక చెట్లు ఎండిపోతున్నాయి ఇది మా మా పరిస్థితి నేల తల్లిని నమ్ముకుని, చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఈరోజు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. సకాలంలో వర్షాలు కురవక, వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తిన కాస్త పంట కూడా ఎండతీవ్రతకు ఎండిపోతుంటే రైతు గుండె తరుక్కుపోతోంది. నాగలి పట్టి పొలాన్ని దున్ని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతన్న ప్రతిరోజూ ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. మేఘాలు కమ్ముకొస్తున్నట్టే వచ్చి మాయమవుతుంటే, వారి కళ్ళల్లో ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. బావులు ఎండిపోయాయి, బోర్లు అడుగంటాయి. కంటిముందే పంట చేను ఎండిపోతుంటే, ఏం చేయాలో పాలుపోక, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతల కన్నీళ్లు నేల రాలుతున్నాయి ప్రకృతి కన్నెర్ర చేసిన ప్రతిసారీ బలి అవుతున్నది రైతు మాత్రమే. ప్రభుత్వం మరియు సమాజం స్పందించి, కరవు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.