ఆక్యుపెన్సి సర్టిఫికెట్లు పొందిన బిల్డింగులను కూడా సర్వేనెంబర్ల ఆధారంగా 22 ఏజాబితాలో చేర్చడం జరిగింది.మిరియాల రాఘవరావు

పయనించే సూర్యుడు, జూన్ 05 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ కార్యని ర్వాహక వర్గము 3 -6- 2026 అత్యవ సర సమావేశము నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రస్తుతం నిర్మాణదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూలంకుషంగా చర్చించారు. అసోసి యేషన్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ రావు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో సెంట్రింగ్ కార్మికుల రేట్లు వ్యవహారంలో సెంట్రింగ్ కార్మికులు సైట్లు దగ్గరికి వచ్చి బిల్డర్స్ అసో సియేషన్ వారు రేట్లు పెంచినట్లుగా చెబుతూ వారి యొక్క అగ్రిమెంట్ పేపర్లు పట్టుకుని అందరూ సంతకం పెట్టాలని కోరుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిన ట్టుగా అసోసియేషన్ సభ్యులకు తెలియ పరిచారు. వారు మాట్లాడుతూ హైద రాబాదులోని ఏ అసోసియేషన్స్ అనగా క్రెడాయ్ , నేరేడుకో అలాగే టి. బి.ఎఫ్ ప్రతినిధులు ఎవరు కూడా రేట్లు పెంచి నట్టుగా ఎక్కడ ఎవరికి చెప్పి ఉండలేద ని తెలియపరిచారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సెంట్రిం గ్ కాంట్రాక్టర్ల రేట్లు పెంపుని వ్యతిరేకిస్తూ, సెంట్రింగ్ కాంట్రాక్టర్ల మిగిలిన కోరికలు అయిన హెల్త్ కార్డు విషయంలో కానీ ఈ.ఎస్.ఐ వ్యవహారంలో కానీ అదేవి ధంగా కార్మికులకు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి పొందే ఏదైనా ఎక్స్గ్రేషియా విషయంలో కానీ అన్ని అసోసియేషన్లు కార్మికులకి అండగా ఉండి చేయూతనందిస్తామని తెలియ పరిచారు. ప్రస్తుత రేట్లు పెంపుదల అనేది ఎవరి వ్యక్తిగతం వారిది కానీ అసోసియేషన్లు ఎవరికి ఎటువంటి బాధ్యత లేదని నచ్చిన వాళ్ళు వాళ్లకు తోచిన రేటు పెంచి వారి యొక్క కాంట్రాక్టర్ తో మాట్లా డుకోవాల్సిందే గాని ఏ ఒక్క అసోసి యేషన్ పెంపును సమర్థించ లేదని తెలియపరిచారు. అదేవిధంగా ఎవరై నా సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ప్రతిని ధులు సైట్ల వద్దకు వచ్చి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా అసోసియే షన్ సభ్యులు వెనుకాడరని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం బిల్డర్స్ ఎదుర్కొం టున్న అతి ముఖ్యమైన సమస్య అయి నా ట్రాన్స్ఫార్మర్ వ్యవహారం మీద కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభా కర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వము ట్రాన్స్ఫార్మర్ వ్యవ హారాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తు ఎరిగి, అదేవిధంగా ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు చేసిన మార్పుల వల్ల జరుగుతున్న ఇబ్బందులు గుర్తు ఎరిగి తక్షణము బిల్డర్లకు ట్రాన్స్ఫార్మర్స్ మీటర్లు పొందడంలో ఎదురవుతున్న సమ స్యలను తదనుగుణంగా కొనుగోలు దారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తక్షణం పరిష్కరించా లని, దానికోసం భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుందామని సభ్యులను కోరడం జరిగింది.అదేవి ధంగా ప్రస్తుతం ప్రభుత్వము ప్రతిపాదిం చిన మార్కెట్ విలువల పెంపు గూర్చి మాట్లాడుతూ ల్యాండ్స్ రేట్లు పెంచడంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ అపార్ట్మెంట్లఎస్. ఎఫ్ టి.రేట్లు విషయం లో ప్రభుత్వం పున రాలోచిం చాలని ప్రభుత్వాన్ని కోరారు.ముఖ్యంగా ఎస్ ఎఫ్ టి రేట్లు పెరగడం వలన కొను గోలుదారుడు మీద అధిక భారం స్టాంప్ డ్యూటీ అదే విధంగా జిఎస్టి రూపంలో పడుతుందని అందు వల్ల కొనుగోలుదా రునికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా లోగడ రాజశేఖర్ రెడ్డి ప్రభు త్వం హయాంలో చేసిన విధంగా ఎఫర్టబుల్ హౌసింగ్ స్కీమ్ కింద స్టాంప్ డ్యూటీ లో తగ్గుదల చేయాలని అదేవి ధంగా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినచో మరియొక 1% తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని ప్రతిపాదించారు. చిన్న బిల్డర్స్ యొక్క మను గడ కోసం ప్రభుత్వం తక్షణం కార్యాచ రణ రూపొందించాలని ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొన్ని ప్రాంతా లలో 22 ఏ జాబితాలో చేర్చిన భూము లను మరొక్కసారి సరిచూ సి,లోగడ జిహెచ్ఎంసి గాని హెచ్ఎం డిఏలు ద్వారా కానీ వేసిన లేఔట్లలో ఫ్లాట్స్, అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్లు తీసుకుని కన్స్ట్రక్షన్ చేసి ఆక్యుపెన్సి సర్టిఫికెట్లు పొందిన బిల్డింగుల ను కూడా సర్వే నెంబర్ల ఆధారంగా 22 ఏ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ విధంగా జరిగిన పొరపాట్లను గుర్తించి సవరణ చేయవ లసిందిగా ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మీటింగ్ లో ప్రగతి నగర్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, రాజా రెడ్డి, నారాయణరెడ్డి, గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మిరియాల రాఘవరావు, కే.రాజా రెడ్డి,పి.బి.ఎస్. విశ్వనాధ్ ,స మ్మెట ప్రసాద్,శశిధర్ రెడ్డి స్వప్న శ్రీనివా స్ ,ఉప్పల్ అసోసియేషన్ ప్రతినిధు లు ఆకుల సత్యనారాయణ, ఎస్ రమేష్ , జక్కా వెంకటరెడ్డి, సిహెచ్ మురళి, పద్మాకర్ రెడ్డి ఈస్ట్ జోన్ బిల్డర్స్ ప్రతినిధులు శ్రీ టి. నరసింహారావు, కూకట్పల్లి జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కే.చక్రపాణి , బి.గోపాల్, యోగేంద్ర సింగ్ అదేవిధంగా గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ టీ. విద్యాసాగర్,మధు రమేష్ బాబు మోహన్ రావు, సురేష్ పాల్గొన్నారు. చిన్న బిల్డర్స్ యొక్క మనుగడ కోసం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రా లు అందజేయాలని, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తున్న నిర్మాణ రంగాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వా న్ని కోరుతూ, తదనగుణంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రతినిధు లు చెప్పారు. ప్రభుత్వం చిన్న బిల్డర్లు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల ను తక్షణం పరిచర్యంచ వలసిందిగా కోరుకుంటూ లేనియెడల నిర్మాణాలను తాత్కాలి కంగా నిలిపి వేస్తూ వారి యొక్క నిరసన తెలియజే యడానికి కూడా కార్యాచరణ రూపొం దిస్తామని తెలియజేశారు.