02 Nov 2026 | 11:53 PM

ఆదోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు.

ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన .కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్.

పయనించే సూర్యుడు నవంబర్ 3 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.ఆదోని లో సుమారు 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు.స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర నిషేధిత వస్తువులకు అనుమతి లేదు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. ఆదోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే లోపలికి అనుమతిస్తారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, పెన్నులు, పేపర్లు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం నిషేధం.స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తేకఠినచర్యలుతీసుకుంటామన్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్లు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఆదోని ఏఎస్పీ జయశర్మ, ఆర్డీఓ అరుణాదేవి, మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, సీఐలు పాల్గొన్నారు.