ఆయిల్ పంటకు మంట పెట్టిన దుండగులుఫైర్ ఇంజన్ ఆలస్యంతో మరింత పంట నష్టం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 04 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని వాటర్ బెడ్ దగ్గర గల రైతు మోసరపు సాయబు కి చెందిన ఆయిల్ ఫాం తోటకు ఎవ్వరో గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టగ చేతికి పంటకు వచ్చిన ఆయిల్ పంట దాదాపు అరవై వరకు చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి దాంతో భారీ పంట నష్టం జరిగింది,మంటలు ఎగిసి పాడగా ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా అగ్నిమాపక శకటం ఆలస్యంగా రావడంతో పంట నష్టం మరింత పెరిగింది,తక్షణమే సదరు అధికారులు స్పందించి దుండగుల గుర్తించి శిక్షించాలని ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించాలని రైతు విజ్ఞప్తి చేసారు