ఆలూర్ ట్రాక్టర్ ఓనర్స్ నూతన కార్యవర్గం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 16 మామిడిపెల్లి లక్ష్మణ్ మండలంలోని ఆలూరు గ్రామ ట్రాక్టర్ సంఘం నూతన కార్యవర్గము ఏర్పాటు చేశారు. అధ్యక్షులు ఎలిపెద్ది తిరుపతి, కార్యదర్శి ఏనుగు చిన్న అంజిరెడ్డి. నూతన కార్యవర్గం ఊరులో రానున్నది కేజీవీల్ సమయం కబడ్డీ రోడ్లు ఖరాబ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరంగా తిరిగి రోడ్లు పాడుచేయద్దు అని సభ్యులందరికి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో తీసుకున్న ప్లాస్టిక్ నివారణకు తమవంతు భాగస్వామ్యంగా గ్రామాణికి సరిపోయే 500 నీళ్ల గ్లాసులు అందజేస్తామని గ్రామ సర్పంచ్ నల్లాల స్వామికి తెలిపారు.