ఆల్ ఇండియా ఐఐటీ లో ర్యాంక్ సాధించిన చిన్నారిని సన్మానించిన

మండల బిఆర్ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 13 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని నారాయణ పురం గ్రామానికి చెందిన కీర్తి అనే విద్యార్థిని బాసరలోని ఐఐటీ లో ఆల్ ఇండియా 561 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా ఆ విద్యార్థిని నీ అభినందిస్తూ సన్మానించిన అశ్వారావుపేట మండల బిఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో అశ్వారావుపేట కి మంచి పేరు తెచ్చినందుకు, చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల కష్టాలను చూస్తు వారు పడ్డ కష్టాన్ని వమ్ము చేయకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.విద్యార్థులు ప్రతి రోజు కష్టపడి చదివే విద్యార్థులకు వారు సాధించిన విజయాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు, పరీక్షలలో అత్యదిక మార్కులు సాధించటానికి కావలసినది క్రమశిక్షణ మరియు పట్టుదల,గురువుల దగ్గరనుండి నేర్చుకొనే క్రమశిక్షణ మాత్రమే ఇంతటి విజయానికి కారణం అని తెలియజేశారు.కీర్తి ఇంకా ఉన్నత చదువులలో అలాగే ర్యాంకులను సాధించి అశ్వారావుపేట మండలానికి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొచ్చి మరింత ఉన్నత స్థానానికి చేరాలని వారు కోరారు. అనంతరం కీర్తిని శాలువాతో సత్కరించి నగదు బహుమతిని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం విద్యార్థి కీర్తి వాళ్ళ తల్లిదండ్రులు నివసిస్తున్నది పూరీ గుడిసె అవ్వటం వలన వెంటనే మాజీ ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి ప్రస్తుత ఎమ్మెల్యే జారే అధినారాయణ కి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయమని కోరడం జరిగింది,దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఇళ్ళు మంజూరు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది,అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కి కృతజ్ఞతలు తెలియజేసిన మండల నాయకులు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపల్ కౌన్సలర్ డాక్టర్ ఉదయ జ్యోతి,మాజీ ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి, కాసాని. చంద్రమోహన్, కాసాని. పద్మ, భూక్య. ప్రసాద్ రావు, సంక. ప్రసాద్, చిన్నంశెట్టి. వెంకట నరసింహం, జజ్జూరపు. శ్రీరామమూర్తి, సత్యవరపు.సంపూర్ణ, నవీన్, మోటూరి. మోహన్, బన్ను, జక్కుల రాంబాబు,కాటూరి నాగేశ్వరావు,కలపాల మంగరాజు,చందా కుమారస్వామి, మద్దాల రమణయ్య, కౌలూరి నరేష్,కాటూరి చిలకయ్య, యడ్లపల్లి ఏసు బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.