
పయనించే సూర్యుడు జూన్ 13 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పట్టణంలోని 17వ వార్డు ఆర్.ఆర్. లేబర్ కాలనీ వద్ద గల ఆవు దూడ వంకపై వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) పట్టణ కార్యదర్శి టి.వీరేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆవు దూడ వంక ప్రాంతాన్ని సందర్శించిన సి.పి.ఐ. నాయకులు స్థానిక ప్రజల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలంలో వంకలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ఆర్.ఆర్. లేబర్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, కార్మికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆవు దూడ వంకపై శాశ్వత ప్రాతిపదికన కల్వర్టు నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమనిఅన్నారు. అదేవిధంగా ఆర్.ఆర్. లేబర్ కాలనీలో మహిళల కోసం తగిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. పట్టణ సహాయ కార్యదర్శి కె రమేష్ ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రంజిత్ గౌడ్ డిహెచ్పిఎస్ నియోజకవర్గ కార్యదర్శి ఏ విజయ్ కుమార్ అంజి లింగప్ప తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.