ఇందుకూరుపేట కేంద్రంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం.

పయనించే సూర్యడు జులై.08.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం ఇందుకూరుపేట కేంద్రంగా.భారతీయ జనతా పార్టీ మండల పదాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మండల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మండలంలో ఉన్న వివిధ మోర్చా కమిటీలు,శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ కమిటీలు గురించి చర్చించడం జరిగింది.మండలంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక రకాలైన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించి చెప్పాలని.మరియు ప్రతి ఒక్క అర్హులకు అందే విధంగా చూడాలని చెప్పడం జరిగింది.రాబోయే స్థానిక ఎన్నికలలో పోటీ చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ప్రధాన కార్యదర్శి అయినాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అరగంటి వీరభద్రా రెడ్డి,ఉపాధ్యక్షులు చెదల నాగిరెడ్డి,ఉపాధ్యక్షులు మడకం లక్ష్మణ్ రావు, మాజీ మండల అధ్యక్షులు పడమటి లక్ష్మణరావు,సీనియర్ నాయకులు రావిపాటి గోవిందరావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సభ్యులు బొంతు చక్రి, చిర్రా చిట్టిబాబు, మండల కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కారం సత్యనారాయణ (గోపి) వల్ల రామి రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.