పయనించే సూర్యుడు-13-06-2026-రాజంపేట న్యూస్ : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజా వెన్నుపోటు పాలన అని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వైయస్సార్సీపి తలపెట్టిన "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. అనంతరం కూటమి మేనిఫెస్టో ప్రజలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, అన్నమాచార్య విశ్వవిద్యాలయ వైస్ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.