ఈనెల 10న నాగర్ కర్నూలు లో ఉచిత కంటి చికిత్స శిబిరం.

పయనించే సూర్యుడు జూన్ 5 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ జిల్లా ఆందత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యం లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డు లో గల శోభ ఆప్టికల్ లో ఈనెల 10న బుధవారం నాడు ఉదయం 9గంటలకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు విశ్రాంత ఆప్తాలమిక్ ఆఫీసర్ బి.శివారెడ్డి తెలిపారు.ఈ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి, క్యాటరాక్ట్ పోరగల వారినీ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి, ఎనుగొండ,మహబూబ్ నగర్ కి పంపించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనునట్లు తెలిపారు.రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా రక్తపరీక్షలు,సాధారణ పరీక్షలు, ప్రతిరోజు నిర్వహిస్తారని తెలిపారు.శిబిరానికి వచ్చే ముందు ఆధార్ కార్డు,ఓటర్ కార్డ్, లేదా రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కు 9440454284, 8106333324 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు.