ఈనెల 20 నుండి మెడికల్ షాపులు చేయబడినవి.

పయనించే సూర్యుడు మే 21 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్. అఖిలభారత డ్రగ్గిస్ట్ మరియు కెమిస్ట్ అసోసియేషన్ చిన్న పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బందు పాటిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్ ఇస్తూ సాంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని అలాగే ఆన్లైన్ మందుల అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20 నుండి దేశవ్యాప్తంగా మెడికల్ షాపులో బందుకు అఖిలభారత కెమిస్ట్రా అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు బందుకు పిలుపునిచ్చాయి ఈ మేరకు ఈరోజు పాపన్నపేట మరియు టేక్మాల్ మెడికల్ షాప్ అసోసియేషన్ నాయకులు ఎమ్మార్వోకు మరియు ఎస్ఐకి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గజవాడ రాజేశ్వర్ కార్యదర్శి బెజగం విఠలేశ్వర్ కోశాధికారి సాయిలు అసోసియేషన్ నాయకులు రాజు రామకృష్ణ ఈశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు