ఈనెల 8 న రాష్ట్ర సీఎం మియాపూర్ లో జరగనున్న అభివృద్ధిపనుల కోసం క్యాంప్ కార్యాలయంలో పిఎసి చైర్మన్ గాంధీ నిర్వహించిన సమీక్ష సమావేశం

పయనించే సూర్యుడు, జూన్ 06 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఈ నెల 8వ తేదీన ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి శేరిలింగం పల్లి నియోజకవర్గానికి విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ డంతో పాటు మియాపూర్ వెజిటేబుల్ మార్కెట్ ఆవరణలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్న తరుణం లో కార్యక్రమ విధి విధానాలు, ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయ వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తో చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుండి ప్రజలు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనతో నియోజక వర్గ అభివృద్ధికి మరింత ఊపు రానుం దని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పని చేస్తుందని కార్పొరేటర్ తెలిపారు. అనంతరం నూతనంగా తెలంగాణ యాదవ ఫెడరేషన్ ఛైర్మెన్ గా బాధ్య తలు చేపట్టిన మారబోయిన రఘు నాథ్ యాదవ్ ని శాలువాతో సత్క రించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని తదితర డివిజన్ ల మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.