పయనించే సూర్యుడు జూన్ 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసాయినిపల్లి గ్రామంలో ఈరోజు బాచుపల్లిలోని హైదరాబాద్ మమత హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు గ్రామంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ పిట్టల చంద్రకళ శ్రీరాములు, ఉపసర్పంచ్ చెంచటి సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి మరియు ప్రసన్నగౌడ్ హాజరై, శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నుండి వచ్చిన నిపుణులైన వైద్య బృందం గ్రామస్థులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అన్ని రోగాలకు సంబంధించిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఉచితంగానే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్లు: సర్పంచ్ పిట్టల చంద్రకళ శ్రీరాములు మాట్లాడుతూ… గ్రామంలోని పేద ప్రజల ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు (మేజర్ ప్రాబ్లమ్స్) ఉన్నట్లు గుర్తించిన రోగులను, మమత హాస్పిటల్ యాజమాన్యమే స్వయంగా తమ వాహనాల్లో హైదరాబాద్కు తరలిస్తుందని పేర్కొన్నారు. అక్కడ వారికి అన్ని రకాల అధునాతన పరీక్షలు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు పూర్తి చేసి, తిరిగి సురక్షితంగా గ్రామానికి చేర్చుతారని వెల్లడించారు. ఈ సువర్ణ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గమనిక: పేద ప్రజల చెంతకే కార్పొరేట్ వైద్యాన్ని తీసుకువచ్చిన మమత హాస్పిటల్ వైద్య బృందానికి మరియు యాజమాన్యానికి గ్రామ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.