పయనించే సూర్యుడు జూలై 08 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని ఉడిత్యాల గ్రామంలో సంబని యాదగిరి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదగిరి మిత్రులు, కుటుంబ సభ్యులు, పలు పార్టీల నాయకులు ఆయనకు కేక్ తినిపించి, శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బాలానగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఎర్ర యాదయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సంబని కృష్ణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని యాదగిరి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మహేష్, అయ్యానోళ్ల కృష్ణయ్య, ఎర్రబాగని విష్ణు, జె. రాజు, బి. కృష్ణ, నరేష్, ప్రణీత్, మధు, జగన్ గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.