ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి .

★ ఏపీ ఎన్జీజివోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల్ .

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. కాశీబుగ్గ రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయం నందు పలాస డివిజన్ ఉద్యోగస్తులు కమర్షియల్ టాక్స్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీఎస్ఆర్టీసీ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ నియమించి ఐ ఆర్ ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు రావలసిన డి ఏ ఏరియాస్, సరెండర్ లీవ్స్ ఇతర బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య సంక్షేమ వారధిగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని తమవంతుగా బాధ్యతగా తీసుకెళుతున్న ఉద్యోగుల ఆర్థిక ,న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షులు చౌదరి పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఎడిషనల్ క్వాంటం పెన్షన్ ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగుల ఈ హెచ్ ఎస్ సక్రమంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ చల్లా శ్రీనివాసరావు అసోసియేట్ ప్రెసిడెంట్ కంట జయరావు జాయింట్ సెక్రెటరీ కొర్ల మన్మధరావు, పలాస ఏపీ ఎన్జీవో అధ్యక్షులు బోనెల గోపాల్, సెక్రెటరీ బి ఉపేందర్ రావు,అసిస్టెంట్ కమిషనర్ కందుల నాగరాజు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జి శారదా దేవి ఖాళీ ప్రసాద్ పండ , బాలు, కె వి నరసింగ మూర్తి ,బి భార్గవ్, భాగ్య రావు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ,ఏపీఎస్ఆర్టీసీ సంఘ నాయకులు శ్రీనివాసరావు రిషికేశ్వరరావు చక్రధర్, శ్యామ్ పంచాయతి రాజ్ సద్గుణబాబు, ఇరిగేషన్ అధికారి పి శ్రీనివాసరావు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రగడగిరి, కోపరేటివ్ అధికారి దుర్గాప్రసాద్ పట్నాయక్ గ్రీన్ ఆర్మీ సభ్యులు కిషోర్ పాత్రో వివిధ ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.