ఉపసర్పంచ్ కుటుంబంలో పెళ్లి సందడి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ జులై 3 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలంలోని రేకులగూడెం గ్రామ ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ–యశోద దంపతుల కుమార్తె శిరీష వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకులు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకులు, జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మేకల మళ్లీ బాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డగూడ ఐలయ్య, కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్, రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం నాయకులు ఏడుకొండల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శిరీష–సురేంద్రల దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ నూతన దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు. వివాహ వేడుకలో బంధుమిత్రులు, గ్రామస్థులు, యాదవ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.