ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

★ సాలుర మండలం ఎంపీడీవో శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్ మే 22 సాలూర : సాలుర మండలం కుమ్మన్ పల్లి గ్రామంలో ఉపాది కూలీలకు సౌకర్యాలు కల్పించాలని సాలూర మండల ఎంపీడీవో శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ఎండ తీవ్రంగా ఉన్నందున ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉపాధి కూలీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులకు హెచ్చరించారు కుమ్మన్ పల్లిలో ఉపాధి పనుల ప్రాంతాన్ని గ్రావెల్ రోడ్డులను అంగన్వాడీలను మండల ఎంపీడీవో శ్రీనివాస్ గురువారం సందర్శించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి ఉపాది కూలీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు