ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ పంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ :మే 24,తల్లాడ రిపోర్టర్ ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డా..శ్రీజ ఈ రోజు తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలు మరియు గ్రామ పంచాయతీల అభివృద్ధి పనుల అమలు తీరుపై వివరంగా సమీక్షించారు. జల్ సంచాయి జన్ భాగీదరి అనే కేంద్ర ప్రభుత్వ పథకం లక్ష్యమైన జల సంరక్షణ జల పొదుపు ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించి లక్ష్యాలను నిర్దేశించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, వేస్ట్ టు వెల్త్ సెంటర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి పనికి సంబంధించిన ఫోటోలను యన్ యం యం యస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని, ఫీల్డ్ విజిట్లు పెంచాలని, లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో యం పి డి ఓ శ్రీధర్ రాజు , ఎ పి డి కల్లూరు చలపతి రావు, మిషన్ భగీరథ (ఇంట్రా) సింధు, ఎ ఈ హౌజింగ్ అస్మా, ఎ పి యం రవి కుమార్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.