పయనించే సూర్యుడు మే 22 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం రాగాంపేట గ్రామం మెడికల్ కాలేజీకి వెళ్లి గాయపడ్డ యశోద ను పరామర్శించిన ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్. ప్రభుత్వమే ఉచిత వైద్యాన్ని అందించి 10లక్షల నష్ట పరిహారాన్ని అందించాలి ఖానాపూర్ మండలంలోని రాగంపేట గ్రామంలో కోరెందుల కుంటలో ఉపాధి హామీ పథకం గ్రామస్తులతో కలిసి కూలి పని చేస్తున్న ముస్కు యశోద పై పెద్ద బండరాయి పడటంతో గాయపడ్డ యశోదను నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి తరలించగా విషయం తెలుసుకున్న ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి క్షతగాత్రురాలు యశోదను పరామర్శించారు. ఇట్టి విషయంపై డ్యూటీ డాక్టర్లతో మాట్లాడగా పెద్ద బండరాయి పడటంతో తొంటి బొక్కలు విరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలుపగా కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పటల్ తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ప్రకాష్ రావు, సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ. అధికారుల నిర్లక్ష్యం తోనే ఉపాధి కూలీలకు ప్రమాదకరంగా దెబ్బలు తగులుతున్నాయని అన్నారు. ఉపాధి పనులను కూలీలు చేస్తుండగా పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని, అన్నారు ప్రమాదంలో గాయపడ్డ యశోదకు ప్రభుత్వమే ఉచిత వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు అలాగే ₹ 10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దికాయల శ్రీనివాస్, గొడిశాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.