పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 05 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మాగాంధీ గ్రామాల్లో పనుల పరిశీలన కొరకు ప్రతిపాడు నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమ్మిడి వెంకట్రావు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బృందంతో కలిసి మండలంలో ధర్మవరం, ఒమ్మంగి, ఉత్తరకంచి, లంపకలోవ గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించి 2006 లో ఉపాధి హామీ పథకం లో పొందుపరిచినటువంటి ఉపాధి హామీ హక్కులు విధులు పని దినాల గురించి ఉపాధి హామీ శ్రామికులు కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులు పనికి తగ్గ కూలి రావడం లేదు అని ఈ సందర్భంగా కమిటీ కు వివరించటం జరిగినది. అదే విధంగా ఒమ్మంగి గ్రామంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనుల కొరకు పని ముట్లు గానీ పని దినాలు కానీ సరిగ్గా లేవు అని వివరించటం జరిగినది. ఉత్తరకంచి గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్డు లు లేక ఉపాధి శ్రామికులు ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ వారికి తెలియజేస్తున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పనుల దగ్గర వయో వృద్ధులకు టెంటలు గానీ అలాగే పని శ్రామికులకు గునపం, పారా, కత్తులు లాంటి పని ముట్లు సమకూర్చడం లేదు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. అదే విధంగా బుధవారం లంపకలోవ గ్రామంలో ఉపాధి హామీ శ్రామికుడు లింగంపల్లి వీరభద్రరావు వడ దెబ్బకు పని దగ్గర స్పృహ కూలిపోయి ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వం నుండి రావలసిన స్కీములు లభించేలా ప్రభుత్వంతో మాట్లాడతాము అని వారి కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ ధర్నాలకోట శ్రీను, ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకుర్తి సూర్యనారాయణ, దొడ్డిపట్ల సుబ్బరాజు, కొప్పన కోటేశ్వరరావు, ధోని వెంకటేశ్వరరావు, దొంతంశెట్టి చంద్రశేఖర్, పెద్దిరెడ్డి వీరబాబు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.