ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ శివశంకర్ రెడ్డి

పయనించే సూర్యుడు 21 .మే న్యూస్ మండల రిపోర్టర్ మొహమ్మద్ అజ్మత్. జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రం లోని జీడికల్ గ్రామంలో ఎంపీడీఓ శివశంకర్ రెడ్డి మరియు సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ గ్రామం లోని పాత చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని అందరూ కూడా ఉపాధి హామీ పనులను ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. గ్రామంలో చేస్తున్న ఉపాధి హామీ పని ఆధారంగానే గ్రామపంచాయతీకి గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించబడతాయని, ఎంత ఎక్కువగా పనిచేస్తే అన్ని ఎక్కువ డబ్బులు జమ అవుతాయి అని చెప్పడం జరిగింది.అదేవిధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం తొందరగా వచ్చి తొందరగా పని ముగించుకొని వెళ్లాలని, వడ దెబ్బ తగులకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ వరలక్ష్మి మరియు వార్డు సభ్యులు వెంకట్ రెడ్డి, నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు.