పయనించేసూర్యుడు న్యూస్ మే 30 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భగ్గుమంటున్న ఎండల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు చల్లని ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ పార్టీ మండల కీలక నాయకులు కాసాని నాగ శేషా పద్మ – చంద్రమోహన్ దంపతులు ముందుకు వచ్చారు. వారి సౌజన్యంతో అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు చేరుకున్న నాయకులు కూలీలకు స్వయంగా మజ్జిగ ప్యాకెట్లు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లో శ్రమిస్తున్న కార్మికులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం పట్ల కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసాని నాగ శేషా పద్మ వీడియో కాల్ ద్వారా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పని చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, తరచూ నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కూలీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ పట్ల నారాయణపురం ఉపాధి హామీ కూలీలు కాసాని నాగ శేషా పద్మ – చంద్రమోహన్ దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, జక్కుల రాంబాబు, నారం అనురాధ, చందా కుమారస్వామి, చిన్నంశెట్టి వెంకట నరసింహం, కలపాల మంగరాజు, కాటూరి నాగేశ్వరరావు, వడ్లనపు కోటేశ్వరరావు తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.